: కేసీఆర్ కుట్రపన్నుతున్నారు: సుధీష్ రాంభొట్ల


ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని బీజేపీ నేత సుధీష్ రాంభొట్ల ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 1956కు ముందు తెలంగాణలో పుట్టింది ఖాసీంరజ్వీ వారసులైన రజాకార్లే అని అన్నారు. వారికి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తింపజేస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News