: అక్రమ నిర్మాణాల కూల్చివేత ఆపేదిలేదు: జీహెచ్ఎంసీ కమిషనర్


అక్రమ నిర్మాణాల కూల్చివేతపై జీహెచ్ఎంసీ చాలా కఠినంగా ఉంది. నిర్మాణాల కూల్చివేతను ఆపేదిలేదని కమిషనర్ సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. బాధితులు తమను సంప్రదిస్తే ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పారు. ఈ మేరకు స్టాండింగ్ కమిటీ తీర్మానాన్ని ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. పంజాగుట్ట వద్ద నాలాపై వంతెన నిర్మాణాన్ని వంద రోజుల్లో పూర్తి చేస్తామని కమిషనర్ తెలిపారు. ఇప్పటివరకు హైదరాబాదులో పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News