: స్వామి విఠలానంద సరస్వతి కన్నుమూత
శ్రీ స్వామి విఠలానంద సరస్వతీ మహరాజ్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని శ్రీపాద వల్లభాపురానికి చెందిన విఠలానంద గుండెజబ్బుతో బాధపడుతూ, ఈ నెల 7వ తేదీన హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శ్రీపాద వల్లభాపురంలో ఆయన ఆశ్రమం నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంతకు మునుపు నిమ్స్ లోని పేద రోగుల సహాయార్థం ఆయన చక్రాల కుర్చీలను విరాళంగా ఇచ్చారు. విఠల్ బాబా మరణవార్త తెలియగానే మహబూబ్ నగర్ జిల్లా నుంచే కాక హైదరాబాద్ కు చెందిన భక్తులు నిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన భౌతికకాయాన్ని భక్తుల సందర్శనార్థం శ్రీపాద వల్లభాపురంలోని ఆశ్రమానికి తరలించారు.