: నా ఉరిపై అద్వానీయే నిర్ణయం తీసుకోగలరు: అఫ్జల్ గురు


తన ఉరి శిక్ష విషయంలో నాన్చివేత ధోరణిపై కొన్నేళ్ళ క్రితం ఉగ్రవాది అఫ్జల్ గురు తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు. 2008లో ఒక వార్తా సంస్థతో అఫ్జల్ ఈ విధంగా మాట్లాడాడు..
''జైల్లో జీవితం నరకాన్ని తలపిస్తోంది. చచ్చి బతకడం నా వల్ల కాదు. నా ఉరి శిక్షపై వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అయినా యూపీఏ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి రెండు నాలుకలు. డబుల్ గేమ్ ఆడుతోంది. భారత్ కు లాల్ కృష్ణ అద్వానీ ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నాను.

నా ఉరి విషయంలో ఆయనే ఒక నిర్ణయం తీసుకోగలరు, నన్ను ఉరి తీయగలరు. అప్పుడైనా నా బాధకు విముక్తి కలుగుతుంది'' అని అఫ్జల్ జైలులో తాను పడుతున్న బాధను వ్యక్తం చేసాడు. భారత్ కు అద్వానీ ప్రధాని కావాలన్న అఫ్జల్ ఆకాంక్ష నెరవేరలేదు కానీ, అతడు కోరుకున్నట్లుగా యూపీఏ సర్కారు ఉరి శిక్షను అమలు చేసి అతడి బాధకు విముక్తి కలిగించింది. 

  • Loading...

More Telugu News