: విమానంలో బ్లాక్ బాక్స్ సంగతేంటి?
కూలిన మలేసియా విమానం ప్రమాద స్థితి గతులు తెలియాలంటే బ్లాక్ బాక్స్ ను సంపాదించాలి. నారింజ రంగులో ఉండే బ్లాక్ బాక్స్ విమానానికి ఎంత పెద్ద ఉపద్రవం సంభవించినా చెక్కుచెదరదు. దీనిలో అన్ని వివరాలు రికార్డవుతాయి. మలేసియాకు చెందిన ఎంహెచ్ 17 విమానం ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో కుప్పకూలడంతో బ్లాక్ బాక్స్ కోసం ఆ రెండు దేశాలకు చెందిన దళాలు పోట్లాడుకుంటున్నాయి. కాగా, ఆ ప్రాంతంతో పాటు బ్లాక్ బాక్స్ కూడా తమ ఆధీనంలోనే ఉందని డోనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రకటించింది. బ్లాక్ బాక్స్ ను మాస్కో పంపాలని భావిస్తోంది. కాగా, అంతర్జాతీయ సమాజం బ్లాక్ బాక్స్ ను అంతర్జాతీయ దర్యాప్తు బృందానికి అందజేయాలని సూచిస్తోంది.