: బద్రీనాథ్ లో చిక్కుకుపోయిన వారికి సహాయం చేయండి: చంద్రబాబు
బద్రీనాథ్ కు వెళుతూ, మార్గమధ్యంలో చిక్కుకుపోయిన తెలుగువారి గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్, పునరావాస కమిషనర్ లను ముఖ్యమంత్రి ఆదేశించారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలంటూ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహనరావును బాబు ఆదేశించారు.