: కడప జిల్లాలో ఉపాధ్యాయుడి వికృత చేష్టలు
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ ఉపాధ్యాయుడు విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడిన ఘటన కడపజిల్లా బోయనపల్లిలో జరిగింది. ఉపాధ్యాయుడి నైజం గురించి తెలుసుకున్న గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆ కీచక టీచర్ ను అప్పగించాలంటూ పాఠశాలను చుట్టుముట్టారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఆ ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.