: ఇప్పటి వరకు 54,016 ఎకరాల భూమి పంపిణీ జరిగింది: కేఈ కృష్ణమూర్తి


ఇప్పటివరకు ఆరు విడతల్లో మొత్తం 54,016 ఎకరాల భూపంపిణీ జరిగిందని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఏడో విడతలో 20,197 మంది లబ్ధిదారులకు 26,572 వేల ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని ఈరోజు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ శాఖలో సర్వేయర్ల కొరత ఉందని... ఈ ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పట్టణాల్లో చెత్త నిర్వహణ కూడా సరిగా లేదని అన్నారు.

  • Loading...

More Telugu News