: స్వదేశం చేరుకున్న మోడీ... తిరుగు ప్రయాణంలో జర్మన్ ఛాన్సెలర్ మోర్కెల్ తో చర్చలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం అర్ధరాత్రి పొద్దు పోయిన తర్వాత న్యూఢిల్లీ చేరుకున్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ పర్యటనకు వెళ్లిన నరేంద్ర మోడీ తిరుగు ప్రయాణంలో కొద్దిసేపు ఫ్రాంక్ ఫర్ట్ ఎయిర్ పోర్ట్ లో సాంకేతిక కారణాల రీత్యా విమానం ఆగడంతో విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో మరోదఫా జర్మనీ ఛాన్సెలర్ ఏంజిలా మెర్కెల్‌తో ఫోన్ లో మాట్లాడారు. నిన్న మెర్కెల్ జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియచేశారు మోడీ. ఈ సంభాషణల్లో మోడీని వచ్చే సంవత్సరం జర్మనీలో పర్యటించాల్సిందిగా మెర్కెల్ ఆహ్వానించారు. అలాగే 2015లో జర్మనీలో జరగనున్న వాన్ హోవర్ ట్రేడ్ ఫెయిర్ లో భారత్ కూడా భాగస్వామి కావాలని ఆమె మోడీని కోరారు. జర్మనీ ఎప్పటి నుంచో భారతదేశానికి మిత్రదేశమని... ఇండో-జర్మన్ సంబంధాలను మరింత మెరుగుపరచటానికి మెర్కెల్ తో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నాని మోడీ ట్వీట్ చేశారు.