: వైజాగ్ లో వృద్ధురాలి దారుణహత్య


విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఓ జంట... వృద్ధ మహిళను కిరాతకంగా హతమార్చి నగలు దోచుకున్న సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. పెద్దగంట్యాడ మండలం నెల్లిముక్కు ప్రాంతంలో మహాలక్ష్మి అనే వృద్ధురాలు తన కుమారులతో కలసి నివాసముంటోంది. అయితే, అద్దెకు ఇల్లు కావాలంటూ ఓ జంట వచ్చింది. గది నచ్చిందని, కొబ్బరి కాయ కొట్టాలి రమ్మంటూ మహాలక్ష్మిని పై అంతస్తులోకి తీసుకెళ్ళారా కిరాతకులు. అక్కడ ఆమెను గొంతు నులిమి చంపేసిన అనంతరం, ఒంటిపై ఉన్న మూడున్నర తులాల బంగారంతో పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News