: కేంద్ర మంత్రి గోయల్ తో ఏపీ మంత్రి ప్రత్తిపాటి భేటీ


కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో, పలు అంశాలపై ఇరువురూ చర్చించారు. ముఖ్యంగా, విద్యుత్ అవసరాల నిమిత్తం రాష్ట్రానికి అదనంగా బొగ్గును కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనికితోడు, వ్యవసాయానికి నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ ను అందించాలని కోరారు. ప్రత్తిపాటి విజ్ఞప్తికి గోయల్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News