: ఎంఎస్ వోలు ప్రసారాలను ఆపేస్తే ప్రభుత్వం ఏం చేస్తోంది?: బీజేఎల్పీ నేత లక్ష్మణ్ ఫైర్
ఎంఎస్ వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే... తెలంగాణ పభుత్వం చోద్యం చూస్తోందని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ మండిపడ్డారు. కేబినెట్ లో ఇంతవరకు ఈ విషయమై ఎందుకు చర్చించలేదని నిలదీశారు. మీడియా ప్రసారాలను ఆపేసి, ఎంఎస్ వోలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని అన్నారు. రాజకీయ కారణాలతో మీడియాను అణగదొక్కాలనుకోవడం, పత్రికాస్వేచ్ఛను హరించాలనుకోవడం దారుణమని అన్నారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడరాదని ప్రభుత్వానికి సూచించారు. గవర్నర్, కేంద్ర మంత్రులు లేఖలు రాసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.