: టీఆర్ఎస్ ఒడిలోకి టీడీపీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్?
టీఆర్ఎస్ లోకి టీడీపీ నేతల వలసలు మళ్లీ మొదలయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నారని స్పష్టంగా తెలుస్తోంది. దీనిపై ఈరోజు తన అనుచరులతో సమావేశమయిన కమలాకర్ సుదీర్ఘ మంతనాలు జరిపారు. సాయంత్రం గానీ, రేపుగానీ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని సమాచారం.