: ముఖ్యమంత్రిగా చంద్రబాబు గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది:జగన్
శ్రీకాకుళం జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్న జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. నెల రోజుల్లోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని ఆయన అన్నారు. చంద్రబాబు ఇప్పటివరకు తానిచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన అన్నారు. హామీలు నెరవేర్చలేని చంద్రబాబు పై 840 కేసు పెట్టాలని ఆయన చురకంటించారు. ఇప్పుడు గనక మళ్లీ ఎన్నికలు జరిగితే వైసీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.