: ప్రధాని మోడీ విమానం దారి మళ్ళింపు


మలేసియా విమానం క్షిపణి దాడిలో కూలిపోయిన నేపథ్యంలో పలు విమానాలను దారి మళ్ళించారు. ఈ క్రమంలో బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొని బ్రెజిల్ నుంచి తిరిగొస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణిస్తున్న విమానం కూడా రూటు మార్చుకుంది. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే... మలేసియా విమానం కూలిపోయిన గంట తర్వాత మోడీ విమానం ఉక్రెయిన్ గగనతలంలోకి ప్రవేశించినట్టు సమాచారం. అయితే, హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని ప్రయాణిస్తున్న ఎయిరిండియా వన్ విమానాన్ని నల్ల సముద్రంగా మీదుగా దారి మళ్ళించారు.

  • Loading...

More Telugu News