: పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల నయా అడ్డా... హిమాచల్ ప్రదేశ్!
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. జమ్మూకాశ్మీర్, పంజాబ్ లో తీవ్రవాదులు మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలను ఉద్ధృతం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారని భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది. అయితే, ఈ కార్యకలాపాలకు కాశ్మీర్, పంజాబ్ లను కాకుండా హిమాచల్ ప్రదేశ్ ను తమ బేస్ క్యాంప్ గా చేసుకున్నారు ఉగ్రవాదులు. హిమాచల్ ప్రదేశ్ నుంచి కాశ్మీర్, పంజాబ్ లలో తమ ఆపరేషన్స్ ను కొనసాగించాలనేది తీవ్రవాదుల ఆలోచన అని నిఘా వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ లో వివిధ ఉగ్రవాద సంస్థలు తమ కార్యాచరణను సిద్ధం చేసినట్టు సమాచారం. పంజాబ్, జమ్మూకాశ్మీర్ లలో భద్రతాదళాల పహారా ఎక్కువ కావడంతో... సేఫ్ పాయింట్ గా హిమాచల్ ప్రదేశ్ ను ఉగ్రవాదులు ఎన్నుకున్నారని నిఘావర్గాలు అంటున్నాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వం హై ఎలర్ట్ ప్రకటించింది