: ఆరేళ్ల బుడతడు స్పోర్ట్స్ కారును రఫ్ఫాడించాడు


ఆరేళ్లకే అరివీర భయంకర స్పోర్ట్స్ కారును సునాయాసంగా నడిపేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ, కేరళలోని త్రిచూర్ లో ఒక బుడతడు ఇలాంటి పనినే అవలీలగా చేసిపారేశాడు. ఏకంగా ఫెరారీ కారు ఎక్కి తమ కాలనీ చుట్టూ రౌండ్లు వేశాడు. దీనిని అక్కడే ఉన్న మరో చిన్నారి వీడియో తీయడం విశేషం. ఏప్రిల్ 10న ఈ వీడియో యూ ట్యూబ్ లోకి వస్తే ఐదు రోజుల్లోనే దీనిని ఆరు లక్షల మంది చూసేశారు. ఈ చిన్నోడు పెద్దయితే 'ఫార్ములా వన్' కూడా ఊదేస్తాడేమో!

  • Loading...

More Telugu News