: భారత్ కు ఎదురుదెబ్బ... కామన్వెల్త్ క్రీడల నుంచి సైనా ఔట్
వచ్చే వారం కామన్వెల్త్ క్రీడలు ఆరంభం కానుండగా భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ గాయం కారణంగా కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ సందర్భంగా పాదాలకైన గాయాల నుంచి ఇంకా కోలుకోలేదని సైనా పేర్కొంది. కామన్వెల్త్ క్రీడలకు సన్నద్ధమవడానికి గానీ, గాయాల నుంచి కోలుకోవడానికి గానీ తగినంత సమయం లేదని వాపోయింది. కామన్వెల్త్ క్రీడలు ఈ నెల 23 నుంచి ఆగస్టు 3 వరకు బ్రిటన్ లోని గ్లాస్గో నగరంలో జరగనున్నాయి. కాగా, ఈ క్రీడల్లో భారత్ కు పతకం లభిస్తుందని భావిస్తున్న అంశాల్లో బ్యాడ్మింటన్ కూడా ఒకటి. ఇప్పుడు సైనా వైదొలగడంతో భారత బృందంలో నిరాశ అలుముకుంది.