: కాబూల్ కు స్పైస్ జెట్ విమానాల నిలిపివేత


ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ కు స్పైస్ జెట్ విమాన సర్వీసులను నిలిపివేసింది. కాబూల్ ఎయిర్ పోర్టుపై తాలిబాన్ల దాడుల నేపథ్యంలో స్పైస్ జెట్ ఈ నిర్ణయం తీసుకుంది. జులై 3న స్పైస్ జెట్ విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలోనే ఇక్కడి ఎయిర్ పోర్టుపై రాకెట్ దాడి జరిగింది. నిన్న కూడా ఇదే తరహాలో దాడులు జరగడంతో స్పైస్ జెట్ యాజమాన్యం తాజా నిర్ణయం తీసుకుంది. కాబూల్ లో పరిస్థితి మెరుగు పడేంత వరకు విమానాలు నడపబోమని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని తెలిపింది. కాబూల్ ప్రయాణానికి తమ విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు చార్జీలు తిరిగి చెల్లిస్తామని, వారు తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే వేరే విమానయాన సంస్థల ద్వారా వారిని పంపించే ప్రయత్నం చేస్తామని స్పైస్ జెట్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News