: జర్నలిస్టు వైదిక్ పై కోర్టులో పిటిషన్


26/11 పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయిీద్ ను కలసిన సీనియర్ జర్నలిస్టు వేద్ ప్రతాప్ వైదిక్ పై చందౌలి స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశద్రోహ నేరం కింద వైదిక్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సంతోష్ పాఠక్ అనే న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. ఈ నెల 22న ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. జులై 2న జరిగిన వైదిక్-హఫీజ్ సమావేశం ఇప్పటికే పార్లమెంటు ఉభయసభల్లో కలకలం రేపింది.

  • Loading...

More Telugu News