: ఉత్తరప్రదేశ్ ఆరోగ్య సేవలకు బిల్ క్లింటన్ సహకారం
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో యూపీ ఆరోగ్య శాఖ మంత్రి అహ్మద్ హసన్, ఇతర మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలపై క్లింటన్ చర్చించారు. క్లింటన్ హెల్త్ యాక్సెస్ ఇనిషియేటివ్ ద్వారా ఆరోగ్య సేవలకు తమదైన సహకారం ఇచ్చేందుకు ఆయన ముందుకొచ్చినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. 2005లో తొలిసారిగా అప్పటి సీఎం ములాయం సింగ్ యాదవ్ ను క్లింటన్ కలిశారు.