: మావోయిస్టు అగ్రనేత సవ్యసాచి పాండా అరెస్టు
ఒడిశాలోని గంజాం జిల్లాలో ప్రముఖ మావోయిస్టు నేత సవ్యసాచి పాండాను బరంపురం పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే అతనిపై రూ.17 లక్షల రివార్డు ఉంది. 2012లో ఇద్దరు ఇటాలియన్లను కిడ్నాప్ చేసిన పాండా అంతర్జాతీయంగా పాప్యులర్ అయ్యారు. ఆ తర్వాత అతనిని సీపీఐ మావోయిస్టు పార్టీ బహిష్కరించింది. దాంతో, ఇటీవల కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పేరిట వేరు కుంపటి పెట్టుకున్నారు.