: బద్రీనాథ్ లో చిక్కుకుపోయిన తెలుగువాళ్ళు
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బద్రీనాథ్ పుణ్యక్షేత్రం వద్ద 35 మంది తెలుగువాళ్ళు చిక్కుకుపోయారు. కొండచరియలు విరిగిపడడంతో వీరు అక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. గత మూడు రోజులుగా వీరు చినజీయర్ ఆశ్రమంలో ఉంటున్నారు. కాగా, వీరంతా హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రికి చెందిన భక్తులని తెలుస్తోంది.