: భుల్లార్ సింగ్ కు క్షమాభిక్ష కోరిన పంజాబ్ సీఎం


ఉగ్రవాది భుల్లార్ దేవిందర్ పాల్ సింగ్ కు క్షమాభిక్ష పెట్టాలని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను కోరారు. ఈ ఉదయం ప్రధానిని కలిసిన బాదల్.. భుల్లార్ కు ఉరిశిక్ష అమలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఉరితీయడం సరికాదని చెప్పారు. భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన పంజాబ్ సీఎం.. భుల్లార్ కు క్షమాభిక్ష పెట్టాలని పీఎంను కోరినట్లు చెప్పారు. ఉరిశిక్షవల్ల పంజాబ్ శాంతి వాతావరణం దెబ్బతింటుందన్నారు. 1984లో జరిగిన కారుబాంబు దాడికేసులో దోషి అయిన భుల్లార్ కు విధించిన ఉరిశిక్షను జీవితశిక్షగా మార్చే వీలులేదంటూ మూడురోజుల కిందట సుప్రీం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News