: కేసీఆర్ పిచ్చి తుగ్లక్ లా ప్రవర్తిస్తున్నారు: చంద్రబాబు


కేసీఆర్ పిచ్చి తుగ్లక్ లా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రవర్తిస్తున్న తీరు ఏమీ బాగోలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్, మెడికల్ అడ్మిషన్ల (ఎంసెట్) కు పరీక్ష జరిగిందని... అందుకే ఇరు రాష్ట్రాల విద్యార్థులు నష్టపోకుండా ఉమ్మడిగానే కౌన్సిలింగ్ నిర్వహిద్దామని ప్రతిపాదించామని...దీనికి కేసీఆర్ నుంచి సానుకూల స్పందన రాలేదని ఆయన తెలిపారు. కేసీఆర్ పద్ధతి వల్ల రెండు రాష్ట్రాల విద్యార్థులు నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News