: డోర్లు తెరుచుకుని ఉండగానే పరుగులు పెట్టిన మెట్రో రైలు


ఢిల్లీలోని ఓ మెట్రో రైలు తలుపులన్నీ తెరుచుకుని ఉండగానే పరుగులు తీసింది. దీంతో, ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో రైలు డ్రైవర్ ను సస్పెండ్ చేశారు. గుర్గావ్-జహీంగర్ పురి మార్గంలో ఈ ఘటన జరిగింది. అర్జాన్ గఢ్-ఘితోర్ని స్టేషన్ల మధ్య దాదాపు 2 గంటల 40 నిమిషాల పాటు రైలు డోర్లన్నీ తెరుచుకుని ఉన్న స్థితిలో ప్రయాణించింది. చివరికి ఘితోర్ని వద్ద ఈ విషయాన్ని గుర్తించి తలుపులు మూసిన అనంతరం రైలు బయలుదేరింది. దీనిపై ఢిల్లీ మెట్రో రైల్ ప్రతినిధి అనూజ్ దయాళ్ మాట్లాడుతూ, ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ లో లోపం వల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News