: బంగారం రుణాలను కూడా రీషెడ్యూల్ చెయ్యాల్సిందే: ఆర్బీఐకి తేల్చిచెప్పిన ఆంధ్రా సర్కారు


పంట రుణాలతో పాటు బంగారం రుణాలను కూడా రీషెడ్యూల్ చెయ్యాలని ఆంధ్రా సర్కార్ ఆర్.బి.ఐ ని కోరింది. వ్యవసాయ అవసరాల కోసం బంగారాన్ని కుదవపెట్టి రైతులు తీసుకున్న రుణాలు కూడా వ్యవసాయ రుణాల కిందే వస్తాయని.... కాబట్టి వీటికి కూడా రీషెడ్యూల్ వర్తిస్తుందని ప్రభుత్వం ఆర్.బి.ఐకి తెలిపింది. మూడేళ్ల కాలానికి పంట రుణాలను రీషెడ్యూల్ చేస్తామన్న ఆర్.బి.ఐ ప్రతిపాదనకు చంద్రబాబు సర్కారు అభ్యంతరం తెలిపింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏడేళ్ల పాటు రీ షెడ్యూల్ చెయ్యవచ్చని ఆర్.బి.ఐ గతంలో ఓ మాస్టర్ సర్క్యులర్ విడుదల చేసిందని... ఆ సర్క్యులర్ ప్రకారం ఏడేళ్ల రీ షెడ్యూల్ ను ఏపీ రైతులకు వర్తింపచెయ్యాలని సర్కార్ కోరింది. ఏపీలోని కొన్ని ప్రాంతాలు కొన్నేళ్లుగా కరవు బారినపడ్డాయని... మరికొన్ని ప్రాంతాలు తుపాను బారిన పడ్డాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్.బి.ఐకి తెలిపింది. ఈ మేరకు పై వివరాలతో కూడిన ఓ లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ ఐ.వై.ఆర్ కష్ణారావు ఆర్.బి.ఐకి రాశారు.

  • Loading...

More Telugu News