: అరుణగ్రహంపైకి మరో యాత్రకు భారత్ ప్రణాళిక


సంక్లిష్టమైన అంగారక గ్రహ యాత్రకు భారత్ మరోసారి సిద్ధమవుతోంది. 2017-2020 మధ్య కాలంలో ఈ యాత్ర ఉంటుందని ఇస్రో చైర్మన్ కె. రాధాకృష్ణన్ ప్రకటించారు. అయితే, 2013, నవంబర్ 5న తాము చేపట్టిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఫలితం ఆధారంగా తాజా యాత్రపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. మామ్ ఈ ఏడాది సెప్టెంబర్ 24న అంగారక కక్ష్యలో ప్రవేశించాల్సి ఉంది. ఇప్పటివరకు మామ్ 79 శాతం అంగారకయాత్రను పూర్తి చేసుకుందని రాధాకృష్ణన్ చెప్పారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

  • Loading...

More Telugu News