: డిసెంబర్ నాటికి హైదరాబాదులో వై-ఫై
ఈ ఏడాది చివరినాటికి హైదరాబాదును 4జి వై-ఫై సిటీగా మార్చేందుకు తెలంగాణ సర్కారు నడుంబిగించింది. ఈమేరకు సీఎం కె.చంద్రశేఖరరావు రిలయన్స్ గ్రూపు అధికారులతో సమావేశమై చర్చించారు. అంతకుముందు రిలయన్స్ అధికారులతో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కూడా భేటీ అయ్యారు. కాగా, సెప్టెంబర్ నాటికి హైదరాబాద్ వెస్ట్ జోన్ కు వై-ఫై సౌకర్యం కల్పిస్తామని రిలయన్స్ ప్రతినిధులు తెలంగాణ సర్కారుకు తెలిపారు. హైదరాబాదు పశ్చిమ ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక, దశలవారీగా వై-ఫై సౌకర్యాన్ని డిసెంబర్ నాటికి నగరం మొత్తానికి విస్తరింపజేస్తామని వారు వివరించారు.