: ఋతు పవనాల రాకతో చల్లబడ్డ ఢిల్లీ
ఋతు పవనాల ప్రభావం క్రమంగా పెరుగుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం చల్లబడుతోంది. మొన్నటిదాకా భానుడి ప్రతాపంతో అల్లాడిపోయిన ఢిల్లీ వాసులను గురువారం తొలకరి చినుకులు పలకరించాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గురువారం పగటి ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గా నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది.