: మహాత్ముడిపై అరుంధతి రాయ్ సంచలన వ్యాఖ్యలు


జాతిపిత మహాత్మా గాంధీపై ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ కులతత్వ భావాలు ప్రదర్శించారని, జాతిపితగా ఆయన అనర్హుడని, ఆ హోదాకు మరొకరిని ఎంచుకోవాలని పేర్కొన్నారు. ఆయన పేరుతో ఉన్న యూనివర్శిటీలకు, సంస్థలకు పునఃనామకరణం చేయాలని డిమాండ్ చేశారు. కేరళ యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 1936లో గాంధీ రాసిన 'ద ఐడియల్ భంగీ' వ్యాసంలో... మలమూత్రాదులను పారవేయకుండా, ఎరువుగా మార్చుకోవాలని పాకీ పనివారికి సూచించారని అరుంధతి ఎత్తిచూపారు. గాంధీకి హరిజనులపై ఎంత ప్రేమ ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చని వ్యంగ్యం ప్రదర్శించారు. అలాంటి భావాలే నేటి కులాధిపత్య ధోరణులకు బీజం వేశాయని ఆమె విమర్శించారు.

  • Loading...

More Telugu News