: వేగిర దర్యాప్తునకు అన్ని విధాలా సహకారం: ఒబామా


కౌలాలంపూర్ విమాన దుర్ఘటనపై శరవేగంగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. విమానంలోని 298 మంది ప్రయాణికుల్లో 154 నెదర్లాండ్ వాసులే. ఈ క్రమంలో ప్రమాదం తర్వాత నెదర్లాండ్ ప్రధాని మార్క్ రుట్ తో మాట్లాడిన ఒబామా, ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అత్యంత వేగంగానే కాక సంపూర్ణంగా జరగాల్సిన ఈ దర్యాప్తునకు అమెరికా అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా ఒబామా... రుట్ కు హామీ ఇచ్చారు. విచారణ పూర్తి అయ్యేదాకా ఏ ఒక్క చిన్న ఆధారం కూడా జారిపోకుండా జాగ్రత్త వహించాలని అంతకుముందు మలేసియా, ఉక్రెయిన్ దేశాల నేతలతో మాట్లాడిన సందర్భంగా ఒబామా హెచ్చరించారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో విచారణ చేపట్టాలని బ్రిటన్ డిమాండ్ చేసింది. ఇందుకోసం తక్షణమే ఐరాస భద్రతా మండలి భేటీని ఏర్పాటు చేయాలని ఆ దేశం కోరింది.

  • Loading...

More Telugu News