: తీవ్ర విషాదంలో మలేసియా... షాక్ కు గురైన ప్రధాని
ఎంహెచ్-17 విమానం ఉక్రెయిన్-రష్యా సరిహద్దు ప్రాంతంలో కూలిపోయిందన్న సమాచారంతో మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ షాక్ కు గురయ్యారు. తిరుగుబాటుదారులు ఈ విమానాన్ని కూల్చివేయడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ప్రమాదంపై విచారణకు ఆదేశించిన రజాక్, ప్రమాదంలో అసువులుబాసిన వారి కుటుంబాలకు తన సంతాపం తెలియజేశారు. ఇటీవల కాలంలో రెండు విమానాలు కూలిపోవడం పట్ల మలేసియా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.