: విజయవాడ-గుంటూరు రాజధానికే సర్కారు మొగ్గు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని అంశం మరికొన్ని రోజుల్లో తేలనుంది. రాజధానిగా విశేష ప్రచారం అందుకున్న విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతానికే ఆంధ్రా సర్కారు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని రాజధానిపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీతోనూ చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిటీ తాజాగా రాజధాని అంశంపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రి పి.నారాయణను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, విజయవాడ-గుంటూరు ప్రాంతమే అన్ని విధాలా అనుకూలమని కమిటీకి చెబుతామని తెలిపారు.