: టీమిండియా పరువు కాపాడిన రహానే
లార్డ్స్ టెస్టులో టీమిండియా బ్యాట్స్ మన్ అజింక్యా రహానే (103) సెంచరీతో సత్తా చాటాడు. 145 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్ తొలి రోజు ఆట చివరికి 290/9 స్కోరు చేయగలిగిందంటే రహానే ప్రదర్శనే కారణం. ఇంగ్లండ్ తురుపుముక్క ఆండర్సన్ (4/55) పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై నిప్పులు చెరిగాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ కుక్ నిర్ణయం సరైనదేనని నిరూపించాడు. ఇక, భారత జట్టులో ఓపెనర్ విజయ్ 24, పుజారా 28, కోహ్లీ 25 పరుగులు చేశారు. చివర్లో భువనేశ్వర్ కుమార్ 36 పరుగులు చేసి బ్రాడ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. కెప్టెన్ ధోనీ (1), జడేజా (3), ధావన్ (7), బిన్నీ (9) విఫలమయ్యారు.