: చేతికి స్మార్ట్ వాచ్!


రిస్ట్ వాచ్ ఒక ఫ్యాషన్ సింబల్ గా నేడు మారిపోయింది. సమయం తెలుసుకోవడం కోసం కాకుండా, దాన్నొక అందాల ఆభరణంగా చూసేవారే ఎక్కువయ్యారు. ఇక చేతిలో ఇమిడే స్మార్ట్ ఫోన్లూ యువత ఫ్యాషన్ లో భాగమే. అందుకే కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు కొత్త అడుగులు వేస్తున్నాయి.

ప్రముఖ ఐటి కంపెనీ మైక్రోసాఫ్ట్ టచ్ ఆధారిత స్మార్ట్ వాచ్ ను రూపొందిస్తోందని సమాచారం బయటకు పొక్కింది. దీనిపై వ్యాఖ్యానించడానికి కంపెనీ తిరస్కరించింది. అయితే, ఈ స్మార్ట్ వాచ్ కోసం ఉపకరణాలను అందించాలని ఆసియా పంపిణీ దారులను మైక్రోసాఫ్ట్ కోరినట్టు సమాచారం.

మరోవైపు ఎల్జీ కంపెనీ కూడా స్మార్ట్ చేతి గడియారాన్ని మార్కెట్లోకి విడుదల చేసే యత్నాల్లో ఉందని సమాచారం. ఈ వాచ్ లో గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక శాంసంగ్, యాపిల్ కూడా ఇలాంటి ప్రాజెక్టులపై పని చేస్తున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇవి త్వరలో మార్కెట్లోకి వస్తాయని చెబుతున్నాయి. శాంసంగ్ ఏకంగా చేతి గడియారంలోనే స్మార్ట్ ఫోన్ ను తీసుకురావాలని ప్రయత్నిస్తోందట.

  • Loading...

More Telugu News