: భారత్ లోని ఓ గ్రామంలో విద్యార్థులు, మహిళలతో బిల్ క్లింటన్ మాటామంతీ
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ లో అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్ లోని జబ్రౌలి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులకు అందుతున్న వైద్యసహాయం గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయక బృందాల మహిళలతో క్లింటన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా మధ్యాహ్నం భోజన పథకం అమలు అవుతున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు స్వయంగా క్లింటన్ రోటీ, దాల్ ను వడ్డించారు. అమెరికా అధ్యక్షుడుగా ఉన్న సమయంలో మధ్యాహ్న భోజన పథకానికి తాను చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేశారు.