: మలేసియా విమాన ప్రమాదం... 295 మంది మృతి?
మలేసియా విమానం అదృశ్యమైన ఘటన పూర్తిగా మర్చిపోక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. మలేసియా ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం ఉక్రెయిన్ లో కూలిపోయింది. విమానంలో 280 మంది ప్రయాణికులు 15 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. అందరూ మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఆమ్ స్టర్ డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. దీనిని ఉగ్రవాద చర్యగా భావిస్తున్నారు.