: బిందు సేద్యానికి 500 కోట్లు అడిగాం: ఏపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిందు సేద్యానికి 500 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఉద్యానవన పంటల అభివృద్ధికి కేంద్రం 175 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. వీటితో పాటు అదనపు నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్టు పుల్లారావు స్పష్టం చేశారు.