: కడప జిల్లా స్టేట్ బ్యాంక్ ఉద్యోగి చేతివాటం
కడప జిల్లా బద్వేలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. ఎన్నారై లక్ష్మీదేవి ఖాతా నుంచి రూ.5.8 లక్షల నగదును డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు. నగదు డ్రా చేసిన ఉద్యోగి నాగశేఖర్ రెడ్డి పరారీలో ఉన్నాడు. దీనిపై బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.