: సల్మాన్ కు 'కిక్' ఇచ్చిన జాక్వెలెన్ ఫెర్నాండెజ్
సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరినొకరు ఆకాశానికెత్తేసుకుంటున్నారు. 'జాక్వెలిన్ సుందరాంగి, సామాజిక్ సైట్లలో ఆమె ఫన్నీగా ఉంటుంది' వంటి కాంప్లిమెంట్లతో ఆమెను సల్లూభాయ్ పొగిడితే... దానికి ప్రతిగా జాక్వెలిన్ సల్లూభాయ్ ని ఆకాశానికెత్తేసింది. 'సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో సూపర్ స్టార్' అని పేర్కొంది. 'కిక్' సినిమా భారాన్ని సల్మాన్ తన భుజంపై మోశాడని తెలిపింది. 'కిక్' సినిమా ప్రచారంలో సల్లూ భాయ్ పైనే దృష్టి కేంద్రీకరించినట్టుంది?' అని విలేకరులడిగిన ప్రశ్నకు స్పందిస్తూ 'తప్పేముంది? సినిమాకు ప్రాణం సల్మానే. అలాంటప్పుడు ఆయననే చూపించాలిగా' అంది. అంతటితో ఆగకుండా సినిమాకు ఏది మంచో దర్శకులు అదే చేస్తారని సమర్ధించింది.