: బీజేపీలో చేరిన క్రికెట్ ప్రముఖుడు


బీహార్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిత్య వర్మ బీజేపీలో చేరారు. బీహార్ క్రికెట్ అసోసియేషన్ కు బీసీసీఐ గుర్తింపు లేకపోవడం విశేషం. ఆదిత్మవర్మను బీహార్ బీజేపీ అధ్యక్షుడు మంగళ్ పాండే పార్టీలోకి ఆహ్వానించారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ పై సుప్రీంకోర్టులో కేసు వేసి ఆదిత్య వర్మ వార్తల్లో నిలిచారు. కాగా, ఆయన వేసిన పిటిషన్ కారణంగా సుప్రీంకోర్టు బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ ను తప్పించి సునీల్ గవాస్కర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. శ్రీనివాసన్ ఐసీసీ చీఫ్ గా ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News