: 45 రోజుల్లో 43 పథకాలను ప్రవేశపెట్టాం: హరీశ్ రావు
కేవలం నెలన్నర వ్యవధిలోనే 43 పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లా వర్గల్ మండలం చౌదర్ పల్లిలో ఏర్పాటు చేసిన ‘మన ఊరు- మన ప్రణాళిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయితే కార్యక్రమానికి హాజరుకాని ట్రాన్స్ కో ఏఈ, ఏడీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి, వారికి మెమోలు జారీ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి పనులకు సంబంధించి గ్రామస్థాయిలో చర్చించిన మీదటే నిధులను విడుదల చేస్తామని హరీశ్ రావు చెప్పారు.