: అరబ్ షేక్ ల ‘వేస్ట్’ అంతా, ఇంతా కాదట!
చమురు బావుల నిర్వహణతో ప్రపంచంలోనే ధనిక వర్గాలకు నిలయమైన అరబ్ దేశాల పౌరుల ధనార్జన ఎంతుంటుందో, వారు వేస్ట్ చేసే ఆహార పదార్థాల మోతాదూ అంతే ఉంటుందట. ఈ వేస్టేజ్, రంజాన్ మాసంలో మరింత మితిమీరిపోతుందట. ఇలా ఇష్టానుసారంగా వేస్ట్ చేస్తుండటంతో ఆరు అరబిక్ దేశాల కూటమి గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) ప్రపంచంలోనే వేస్టేజీలో తొలి స్థానంలో నిలిచినట్లు తాజాగా ఓ పర్యావరణ సంస్థ జరిపిన సర్వేలో తేలింది. ఏటా జీసీసీ, 150 మిలియన్ టన్నుల ఆహార పదార్థాలను పారవేస్తోందట. విశ్వవ్యాప్తంగా ఏటా 1.3 బిలియన్ టన్నుల మేర ఆహారం వృధా అవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) విషయానికొస్తే, రంజాన్ మాసంలో సాధారణం కంటే రెట్టింపు వేస్ట్ పోగవుతుందట. ‘సాధారణంగా ధనికులు ఆకలి కోసం ఎదురు చూడరు కదా. ఎక్కువ మోతాదులో తయారు చేయించుకుంటారు. ఎక్కువ మోతాదులోనే పారవేయడం మామూలే కదా?’ అంటూ అరబ్ షేక్ ల ‘వేస్ట్’పై సర్వే చేసిన పర్యావరణ సంస్థ విశ్లేషించింది.