: రాహుల్ ప్రధాని అయ్యేవరకు చావను!: కేంద్ర మంత్రి
కాంగ్రెస్ ఉపాధ్యక్ష్యుడు రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి అయ్యేంతవరకు తాను మరణించనని కాంగ్రెస్ నేత, కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బేణి ప్రసాద్ వర్మ అన్నారు. తన నియోజక వర్గం ఉత్తరప్రదేశ్ లోని గోండాలో ఓ కార్యక్రమంలో బేణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. యూపీఏ ప్రధాని అభ్యర్ధి స్పష్టంగా రాహులేనని స్వామిభక్తిని చాటుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, నెలరోజుల కిందట ఎస్పీ అధినేత ములాయంపై బేణి తనదైన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.