: శ్రీవారికి టీవీఎస్ స్టార్ ప్లస్ టూవీలర్ కానుక
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి ఇప్పటివరకు భక్తులు నగదు, బంగారం, వెండి రూపంలో కానుకలు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీవీఎస్ గ్రూప్ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్ టీవీఎస్ స్టార్ ప్లస్ టూవీలర్ ను కానుకగా ఇచ్చారు. ఈ రోజు దాన్ని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంజీ గోపాల్ కు అందజేశారు. వాహనం విలువ యాభై వేలకు పైగా ఉంటుందని అంటున్నారు.