: కర్నూలులో ఐఐటీ నిర్మాణం ఈ ఏడాదే ప్రారంభం: పి. నారాయణ


కర్నూలులో ఐఐటీ ఏర్పాటుకు కేంద్రం సమ్మతించిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పి.నారాయణ తెలిపారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో 11 విద్యాసంస్థలు ఏర్పాటు చేసేందుకు అంగీకరించిందని అన్నారు. విద్యాలయాల కోసం స్థలాల ఎంపికను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. తిరుపతిలో కేంద్ర విశ్వవిద్యాలయం, ఐఐఎస్ఈఆర్ ఏర్పాటు చేయనున్నామని అన్నారు. అనంతపురంలో ఐఆర్ఎస్ నిర్మించి, విశాఖలో ఐఐఎం, గిరిజన వర్సిటీ, ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. అలాగే, రాజమండ్రిలో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News