: ఫిఫా ర్యాంకింగ్స్ లో జర్మనీకి అగ్రస్థానం


ఫుట్ బాల్ ప్రపంచ కప్ ను కైవసం చేసుకున్న జర్మనీ మరో ఘనతను చేజిక్కించుకుంది. తాజాగా ఫిఫా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో జర్మనీ మొదటి ర్యాంకులో నిలిచింది. ఆదివారం జరిగిన ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫైనల్ పోటీలో అర్జెంటీనాను ఓడించిన జర్మనీ 1-0 తో టైటిల్ విజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ చేజిక్కడంతో 24 ఏళ్ల తర్వాత జర్మనీ ప్రపంచ కప్ ను గెలిచినట్లైంది. ఈ ప్రపంచ కప్ లో అగ్రశ్రేణి జట్లు గ్రూప్, లీగ్ దశల్లోనే వెనుదిరిగిన నేపథ్యంలో భీకరంగా పోరాడిన అర్జెంటీనా, నెదర్లాండ్స్ జట్లు ఫిఫా ర్యాంకింగ్స్ లో రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. మూడవ స్థానం కోసం జరిగిన నాకౌట్ మ్యాచ్ లో ఓటమి పాలైన ఆతిథ్య జట్టు బ్రెజిల్ 7వ స్థానంలో నిలిచింది. అగ్రశ్రేణి జట్టు స్పెయిన్ ఎనిమిదో ర్యాంకుకు పడిపోగా, పోర్చుగల్, ఇటలీలు వరుసగా 11, 14 స్థానాల్లో నిలిచాయి.

  • Loading...

More Telugu News