: ఆటోను ఢీకొన్న బస్సు, నలుగురి మృతి


కర్నూలు జిల్లాలో నేడు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది. దీంతో, ఆటోలోని నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. జిల్లాలోని ఆదోని పరిసరాల్లో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మరణించిన వారిలో ముగ్గురు మహిళలున్నారు.

  • Loading...

More Telugu News