: వీళ్ళకు ప్రధాని మోడీ మాటలూ తలకెక్కడంలేదు!


అత్యాచారాలు జరగడానికి గల కారణాలు విశ్లేషించడం మానేయాలని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినా ఈ నేతల తలకెక్కడంలేదు. తాజాగా కర్ణాటక శాసనసభా కమిటీల్లో ఒకటైన మహిళా, శిశు అభివృద్ధి కమిటీ స్కూళ్ళు, కాలేజీల్లో సెల్ ఫోన్లు నిషేధించాలని పేర్కొంది. వీటివల్ల రేపుల సంఖ్య పెరిగిపోయిందని కమిటీ చైర్ పర్సన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే శకుంతల శెట్టి అభిప్రాయపడ్డారు. 'మిస్డ్ కాల్స్'కు స్పందిస్తున్న అమ్మాయిలే అత్యధికంగా సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారని ఆమె తెలిపారు. విద్యార్థులు స్కూళ్ళకు, కాలేజీలకు సెల్ ఫోన్లు తేవడంపై తప్పనిసరిగా నిషేధం విధించాలంటూ రాష్ట్ర సర్కారు విద్యాశాఖకు దిశానిర్దేశం చేయాలని కమిటీ పేర్కొంది.

  • Loading...

More Telugu News